–బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధిత మాదే
–కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాక్తిరి బాబు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట (ఏప్రిల్ 20)
బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధ్యత మాదే అని ములుగు మండలం అచ్ఛాయి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాకీర్తి బాబు అన్నారు.
శనివారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమానికి ములుగు మండలం అచ్చయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాక్తిరి బాబు ముదిరాజ్ ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో అధిక సంఖ్యలో తరలివెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికి నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గత పది సంవత్సరాల్లో కెసిఆర్ నరేంద్ర మోడీ మెదక్ కు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరిని కలుపుకుపోతూ బీసీలను ఏకం చేస్తూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయలేదన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో నిర్వహించిన జన జాతర సభలో దొరలకు పెత్తందారులకు కాకుండా బీసీలు సామాన్యులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల చిరకాల సమస్యలపై శాశ్వత పరిష్కార దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది అన్నారు.నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముదిరాజుల దశ దిశ మసీదుశలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న జరిగిన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎన్నికల బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా తెలంగాణ జనాభాలో సుమారు 15 శాతం ఉన్న ముదిరాజుల చిరకాల వాంఛ అయినటువంటి బీసీ డీ గ్రూప్ నుంచి బీసీ గ్రూప్ ఏలోకి ముదిరాజ్ కులం మార్చే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వచ్చే ఆగస్టు 15వ తేదీ లోపు ముదిరాజ్ కులంను బి సి డి గ్రూప్ నుంచి బిసి ఏ గ్రూపులోకి మార్చుతామని మరియు ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ని శాఖను కేటాయిస్తామని వాగ్దానం చేయడం తో ముదిరాజులకు తగిన న్యాయం చేస్తామని ముదిరాజ్
కార్పొరేషన్ కు అధిక నిధులు కేటాయిస్తామని వారు తెలియజేస్తూ ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజ్ అభ్యర్థులను మరియు కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలలో గెలిపించి పార్లమెంటుకు పంపించే బాధ్యత ముదిరాజ్ జాతిపై ఉందని గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారనీ అన్నారు.
పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.మెదక్ గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పని చేస్తామని చెప్పారు.
