న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీల కన్నంతా ఇప్పుడు మునుగోడుపైనే ఉంది. దీంతో. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగానే రాష్ట్రంలో హైవోల్జేజ్ రాజకీయం నడుస్తోంది.
మునుగోడు ఎన్నిక వేళ అధికార టీఆర్‌ఎస్ బిగ్ షాక్ తగిలనట్లైంది. టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. బూర నర్సయ్య బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బూర నర్సయ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్ షాను కలవనున్నారు. దీంతో ఢీల్లీలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
కాగా 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు బూర నర్సయ్య గౌడ్. ఈ తరువాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఈయన పేరు తెరపైకి వచ్చింది. టీఆర్‌ఎస్ నుంచి ఆయన టికెట్ ఆశించారు. అయితే టీఆర్‌ఎస్ ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బూర నర్సయ్య.. పార్టీ మారేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
