వర్గల్ మండల్ నవంబర్ 3:వర్గల్ మండలంలో బిఆర్ఎస్ రోడ్ షో సామలపల్లి అనే గ్రామం లో ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైనది.
ఈ రోడ్ షో లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోడ్డు షో సామల పల్లి, నెమటూర్, మాదారం వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు బిఆర్ఎస్ నాయకులకు ఘనంగా స్వాగతం పలుకుతూ బతుకమ్మ, బోనాలు డబ్బుచెప్పుల్లతో ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది.