ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ

178 Views

మంచిర్యాల జిల్లా

చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్.,

మంచిరాల జోన్ డిసిపి సుధీర్ కేకన్ ఐపీఎస్., కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద గల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. డీసీపీ వాహన తనిఖీలు చేసిన వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా వాహనాల సిబ్బంది వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డీసీపీ సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. మంచిర్యాల జోన్ చెక్ పోస్ట్ లలో సాయుధ బలగాలతో కూడిన పహారాతో పకడ్బందీగా 24×7 చెక్ పోస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్పోస్ట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది.

డీసీపీ వెంట మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, కాసిపేట ఎస్సై గంగారం ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *