Breaking News ప్రకటనలు ప్రాంతీయం

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు

299 Views

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు.

జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ZPHS ఎల్లారెడ్డి పేట లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు గారు మరియు జిల్లా జె.వి.వి ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు హాజరు కావటం జరిగింది. ఆధునిక కాలంలో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని సైన్స్ ద్వారానే మనకు అనేక ఆవిష్కరణలు జరిగాయని ,సైన్స్ మానవ జీవితాన్ని సులభతరం చేస్తుందని పోటీ ప్రపంచంలో విద్యార్థులు అందరూ బాగా చదివి శాస్త్రవేత్తలుగా మారాలని రామరాజు గారు కోరారు ఈ కార్యక్రమంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల కోర్డినేటర్ కన్నం గంగయ్య గారు, ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు I గరుగుల స్వామి సార్ గారు,జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రధానకార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్ గారు,ఉపాద్యాయులు రాజమల్లు గారు మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మండల స్థాయి పరీక్షలో మొత్తం 12 పాఠశాలల నుండి 38 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది . మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విభాగం (ఆంగ్ల మాధ్యమంలో) దుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి ఎన్నికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విభాగం(తెలుగు మాధ్యమంలో )ZPHS రాచర్ల తిమ్మాపూర్, ప్రైవేట్ పాఠశాలల విభాగం (E/M) లో VIGNAN high school విద్యార్థులు జిల్లా స్థాయికి ఎన్నిక కావడం జరిగింది. వీరిని అతిధులు అభినందించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *