నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :

146 Views

.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్
– ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను గుర్తించడానికి నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. యువత చెడు దారి పట్టకుండా గంజాయి, డ్రగ్స్, దొంగతనాలపై అవగాహన కల్పిస్తూ నేరాలు జరగకుండా పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు గ్రామస్తులందరూ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *