దౌల్తాబాద్ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 5 లక్షలు,ఎంపిటిసి నిధులతో రూ.4లక్షలు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ భాగ్య ఎల్లం, ఎంపిటిసి బండారు దేవేందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, నాయకులు యాదవ రెడ్డి, రాజయ్య, పడాల రాములు, ఇప్ప దయాకర్, సత్యనారాయణ, మల్లేశం, నాగరాజు, నర్సింలు, సత్తయ్య, కన్నా రెడ్డి, నరేష్, రాజు, స్వామి, రమేష్, మల్లయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు…
