మంచిర్యాల జిల్లా.
నేడు ఐస్ యోగ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు మేఘన మరియు మంచిర్యాల ఆయుష్ డిస్టిక్ డిపిఎం రవి రాథోడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని సాయికుంట బాలిక వసతి గృహంలో యోగా నేర్పించడం జరిగింది. పిల్లలకు 8 9 10 విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది. మానసిక ఒత్తిడి మరియు భయాందోళన చదువుల పట్ల చదివినా కూడా గుర్తుండకపోవడం శారీరక మానసిక ఆరోగ్య కారణాలకు సంబంధించి యోగా ద్వారా మెరుగుపరచుకొని భవిష్యత్తులో సమస్యలను పరిష్కారం కోసం ప్రతి రోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని మానసిక ఒత్తిడి లకు గురికాకూడదని ఉన్నతమైన విలువలను ఎదగడానికి యోగ ఎంతగానో తోడ్పడుతుంది. మనుషులను మనిషిగా తీర్చిదిద్దడానికి గుర్తింపు పొందడానికి యోగ అనేది చాలా ముఖ్యంగా తోడ్పడుతుంది. ఈ యోగా అనేది మనకు 4000 సంవత్సరాల నుండి ఉంది కానీ దాన్ని పాటించకపోవడం ద్వారా ఈరోజు అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం, ఇప్పుడు ఉన్న వాతావరణ కాలుష్యం మానసిక ఆందోళనలు అనేకమైన సమస్యలను కూడా వీటి ద్వారా పొందవచ్చునని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ అయిన శ్రీనివాస్ మంచిర్యాల డిపిఎం ఇంచార్జ్ రవి రాథోడ్ యోగా టీచర్స్ సుధాకర్, మేఘన, టీచర్స్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు.





