ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 31, (టీఎస్ లోకల్ వైబు 24/7) తెలంగాణలో నవంబర్లో నిర్వహించనున్న ఎన్నికలక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా, నిర్భయంగా వినియోగించుకునే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవగాహనలు కల్పించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సదయ్య, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డిలు బిఎస్ఎఫ్ మరియు పోలీసు బలగాలతో ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, నామాపూర్, గూడెం, అవునూర్ గ్రామాలలో మంగళవారం ఉదయం కవాతు నిర్వహించి ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ప్రశాంతంగా వినియోగించుకోవాలని గ్రామాలలోనూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని వివరించాలని మీకు అన్నివేళలా అందుబాటులో మేమున్నామంటూ ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు.
