ప్రాంతీయం

జిల్లా ప్రజలకు అందుబాటులో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్

13 Views

జిల్లా ప్రజలకు అందుబాటులో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ .

మంచిర్యాల జిల్లా.

జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు, ప్రజలకు కేంద్ర క్షయ నియంత్రణ విభాగం, రాష్ట్ర వైద్య-ఆరోగ్యశాఖ క్షయ నియంత్రణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ ఎస్.అనిత, ప్రోగ్రాం అధికారి డా॥ సుధాకర్ నాయక్ లతో కలిసి పోర్టబుల్ ఎక్స్ రే మిషను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల సౌకర్యార్థం 23 లక్షల రూపాయలతో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ నెల 21వ తేదీ నుండి జిల్లాలో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మారుమూల గ్రామాలలోని 1 లక్షా 76 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ఈ పరికరాన్ని ఎ.ఐ.కు అనుసంధానం చేయడం జరిగిందని, పరీక్ష రిపోర్టును రోగికి, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు, వైద్య నిపుణులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. 60 సం॥ల పైబడిన వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, బరువు తక్కువగా ఉన్న వారికి, క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు, హెచ్.ఐ.వి. ఎయిడ్స్ రోగులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు వ్యయ ప్రయాసను తగ్గించడంతో పాటు రోగులకు వైద్య సేవలు చేరువలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ మిషన్ తో పాటు ఒక సాంకేతిక నిపుణుడు, ఒక సూపర్వైజర్ అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సమన్వయకర్త సురేందర్, డి.పి.ఓ. ప్రశాంతి పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *