మాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల జర్నలిస్టులు బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, అధ్యక్షుడు బ్యాగరి శంభులింగం, కోశాధికారి ముద్రకోళ్ళ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తదితరులు పాల్గొన్నారు.





