అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది సర్థాపూర్ గ్రామంను సందర్శించారు.బెటాలియన్ కమాండెంట్ .శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సర్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమరవీరుల జ్ఞాపకార్థం శ్రమదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కమాండెంట్ మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ యెక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సమాజ శ్రేయస్సుకు, శాంతి పరిరక్షణకై అసువులు బాసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కమాండెంట్ సూచించారు.ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది అని అన్నారు.




