కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రసమయి
(తిమ్మాపూర్ అక్టోబర్ 30)
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపి నాయకులు మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో సర్పంచ్ మల్లెతుల అంజయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టిలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సాధారణ కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని రానున్న ఎన్నికల్లో రసమయి బాలకిషన్ ని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోను ప్రజలెవరు నమ్మవద్దని పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని అన్నారు.