Breaking News

కలెక్టర్, ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్

34 Views

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించి

ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం

కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు

గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి, వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, మరో ఇద్దరు బిసే ప్రదీప్,
బిసే ఛాయా అక్కడే చిక్కుకుపోగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు.

భారత వైమానిక దళంకు చెందిన హెలికప్టర్ల ద్వారా..
ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితి పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఉదయమే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకొని క్షేమంగా చేరుకున్న వారిని పరామర్శించారు.

క్షేమంగా ఇంటికి..

ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే అక్కడికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడే ఉన్నారు. లింగన్నపేట లో వాగులో చిక్కుకుపోయిన ప్రవీణ్ ను క్షేమంగా ఒడ్డుకు చేర్చే వరకు కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించి.. ఎన్డీఆర్ ఎఫ్ బృందానికి సలహాలు సూచనలు అందించారు. గురువారం ఉదయమే మళ్లీ ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్దకు కలెక్టర్, ఎస్పీ చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించారు. ప్రాజెక్టులో నీటి మట్టం, ఎగువ నుంచి ఎంత వస్తుందని ఆరా తీస్తూ.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారికి మనోధైర్యం కల్పించారు. ఏడుగురు క్షేమంగా గమ్యం చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన విషయం తెలిసి దగ్గరుండి అందరిని క్షేమంగా తరలించడంలో విశేష కృషి చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని, వారికి అధికార యంత్రాంగాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *