ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్30, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పలు గ్రామాలు సైతం తెర్లుమద్ది గ్రామంలో ప్రచారంలో భాగంగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరాపెన్షన్లు, మంచినీరు అందరికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల తమ కుటుంబాలకి రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్దులకి అసరా పెన్షన్ లువస్తున్నాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కెసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని గ్రామాల ప్రజలందరూ పూర్తి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కారు గుర్తుకు ఓటేద్దాం తెలిపి మన తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన లోప్రజలకు ఇంటింటికి తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వం మునుపెన్నడూలేని నూతన పథకాలు మేనిఫెస్టోలో మరెన్నో పథకాలను వివరించి ప్రభుత్వం చేసినటువంటి పనులను వివరిస్తూ మరల మన ప్రభుత్వం వస్తే ఇంకా మరెన్నో అభివృద్ధి పథకాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలు వివరిస్తూ బిఆర్ఎస్ మేనిపెస్టోను ప్రజలకు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపురిత హామీలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు అని అన్నారు. ఇంటింటికీ కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ సిఎంగా, మరోసారి మన సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధిప్రదాత, జనహృదయనేత తారక రామారావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ చంద్రశేఖర రావు, మాజీ జెడ్పిటిసి యాదగిరి గౌడ్, కలకొండ కిషన్ రావు, మాజీ సెస్ డైరెక్టర్లు విజయ రామారావు, కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచి కృష్ణ, బత్తుల అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
