ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్30, బిజెపిలోని కీలక నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కోల కృష్ణగౌడ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బిజెపిలో సుమారుగా ఐదు సంవత్సరాలు నిష్పక్ష పాతిగా పనిచేసి పార్టీని ముందు తీసుకెళ్లిన ఘనత కృష్ణగౌడ్ కు దక్కింది. ప్రధాన కార్యదర్శి బిజెపికి గుడ్ బై చెప్పడంతో మండల వ్యాప్తంగా బిజెపిలో ఒక సందిగ్ధ వాతావరణం చోటు చేసుకుంది. మండల అధ్యక్షుని పనితీరులో జోష్ లోపించడంతో బిజెపిలో అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు క్రమేణా ఇతర పార్టీలకు వలసలకు చేరడంలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని బిజెపి పార్టీ నుండి అటు నాయకులు ఇటు సభ్యులు వలసల పర్వం మొదలైంది. బిజెపికి గుడ్ బై చెప్పిన కృష్ణ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసివెళ్లి సగౌరవంగా తీర్థం పుచ్చుకున్నారు. మండలంలో బిజెపి పార్టీ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతం సమకూర్చడంలో వెసులుబాటుగా తోడ్పాటులేక మనసు శెంచలమై ఏకాగ్రత లోపించడంతో పార్టీ నుండి వెళ్లడం బాధాకరమే. సీనియర్ బిఆర్ఎస్ నాయకులు నీవెన్నంటు నేనున్నానని స్వాగతించడంతో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత విభేదాలతోని వారు బిజెపికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. అంతకుముందు బిజెపిని వీడుతున్నందుకు కన్నీటి పర్యంతమయ్యారు.
