ముస్తాబాద్/అక్టోబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 13,గురువారం రోజు వాహన తనిఖీలను నిర్వహించారు. డి.ఎస్.పి విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో వారితోపాటు గంభీరావుపేట ఎస్సై మహేష్ ఎల్లారెడ్డిపేట ఎస్సైశేఖర్ గంభీరావుపేట మండల్ పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను ఆపి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు సరియైన నెంబర్ ప్లేట్ కాగితాలను హెల్మెట్ లేకుండా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన చర్యలు తప్పువు ఎవరైనాబండి వేరే వాళ్లకు అమ్మినట్లయితే వారి పేరున వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని లేదంటే ఏదైనా అనుకోని ఆక్సిడెంట్ జరిగితే బండి యజమానిపై కేసు నమోదు చేస్తామని డీ.ఎస్.పీ విశ్వ ప్రసాద్ అన్నారు ప్రతి ఒకద్విచక్ర వాహనదారులు నెంబర్ ప్లేట్లపైన రేడియంతో గాని పెయింట్ తో గాని గీతలు బొమ్మలు గీయరాదు వైట్ ప్లేట్ మీద బ్లాక్ నెంబర్ మాత్రమే ఉండాలి నెంబర్ లేకున్నా నూతనంగా వాహనం కొనిన రిజిస్ట్రేషన్ పరిమిత కాలం లోపల రిజిస్ట్రేషన్ చేయించుకుని నెంబర్ ప్లేట్స్ వచ్చిన నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పువు నెంబర్ ప్లేట్ పై నెంబర్లకు బదులు ఏపార్టీ సింబల్స్ ఉండరాదు ఎంతటి వారైనా చర్యలు తప్పవు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సరియైన కాగితాలను చూపించి డ్రైవింగ్ లైసెన్సు చేయించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు సైతం వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు చేస్తామని డీఎస్పీ తెలిపారు. మొత్తం నంబర్ ప్లేట్ లేని 13 ద్విచక్ర వాహనాలు పట్టుకున్నాము అని అన్నారు. ఇకపై పలు మండలాలలో ఇదేవిధంగా తనిఖీ నిర్వహించనున్నామని తెలిపారు.
