ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ లో దొంగలు విచిత్ర మైన దొంగతనానికి పాల్పడ్డారు.
దొంగకు చెప్పే లాభం అన్నట్లు జరిగిన దొంగతనంలో చికెన్ సెంటర్లోని 4 కత్తులను అపహరించారు దొంగలు.
వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్వాజి వెంకట్ సాయి బస్టాండ్ సమీపంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్ళి
గురువారం ఉదయం షాపు తీయడానికి వచ్చి చూసే సరికి షాపుషట్టర్ తాళం పగులగొట్టి వుండటం,షట్టర్ పైకి లేపి ఉండటాన్ని గుర్తించి షాపులోకి వెళ్ళి పరిశీలించాడు.
చికెన్ సెంటర్ లో చికెన్ కొట్టడానికి ఉపయోగించే 2 వేల రూపాయల విలువ చేసే 4 కత్తులు దొంగలు దొంగిలించుకు పోయారు.
తన షాపులో దొంగలు చొరబడి కత్తులు దొంగిలించిన సంఘటనపై సల్వాజి వెంకట్ సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కే.రాహుల్ రెడ్డి తెలిపారు.





