ప్రాంతీయం

ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…

98 Views

ముస్తాబాద్ డిసెంబర్ 6, బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్త  అంటరానితనం కులనిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగశిల్పికి ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంగం అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని పేద బడుగు బలహీనులకు రాజ్యాంగ పరంగా అనేకచట్టాలు తెచ్చివారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అనంతరం వివిధపార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో బడుగు,బలహీనవర్గాలకు ఆనాటి దుస్థితిని గమనించిన అంబేద్కర్ అభ్యున్నతికి తన రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించాడన్నారు. కులమతాలకు అతీతంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే భారతదేశం నేటికీ ఐక్యంగా నిలబడగలిగిందన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, బొంపల్లి సురేందర్ రావు, అంబేద్కర్ సంఘాల ఆర్గనైజింగ్ డైరెక్టర్ చుంచు మల్లయ్య, పెద్దిగారి శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, ఏళ్లబాల్ రెడ్డి, నల్ల నరసయ్య, సుధాకర్, దుబ్బాక రాజు, మనోహర్, శీలం సాయి, అంబేద్కర్ సంఘాల నాయకులు, కార్యకర్తలు పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్