ప్రాంతీయం

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి

63 Views

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి : డ్రాక్టర్ శ్వేత

సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ నవంబర్ 7

జగదేవపూర్  రైతులు విధిగా త మ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్‌ శ్వేత కోరారు.శుక్రవారం మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో అన్ని పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందనీ అన్నారు,

మొత్తం 357 పశువులకు టీకాలు చేయడం జరిగిందన్నారు.4 నెలలు దాటిన దూడలకు, గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ కోసం గాలికుంటు టీకాలు ఇస్తామని తెలిపారు. పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ ,మౌనిక,స్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *