రాజకీయం

నేను గాని, నా భార్య పిల్లలుగాని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ..

182 Views

కూసుమంచి అక్టోబర్ 29 :కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారలంలో భాగంగా ఈరోజు నేలపట్ల వచ్చినప్పుడు మీరు చూపించిన ఈ ప్రేమ అభిమానము మీ ప్రేమకు అందరికి నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.ఇప్పటివరకు మన గవర్నమెంట్ కొత్త పథకాలు ఏమి ఇస్తుంది మనమేం చేస్తున్నాం అనేది మన నాయకులు మీకు చాలా క్లుప్తంగా చెప్పారు.

నేను గాని నా భార్యగాని నా పిల్లలు 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా కచ్చితంగా అందుబాటులో ఉండి మీకందరికీ ఏ చిన్న సమస్య ఉన్న నా ఇంటి సమస్యలగా ప్రతి ఒక్కరికి నాకు చేతనైన సహాయం చేశాము.

ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది అబద్ధం,ఈ నేల మీద పుట్టిన పాలేరు గడ్డ మీద పుట్టిన మీ బిడ్డని కచ్చితంగా మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.నాకోసం ఒక రోజు ఓటు వేయండి,ఐదేళ్లు మీ గురించి నేను కష్టపడతాను.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *