కూచిమంచి అక్టోబర్ 29 :కరోన కాలంలో కూడా మీతో ఉన్న,కష్టకాలంలో కూడా మీతో ఉన్న,ఈకట్టే కాలే వరకు మీతోనే ఉంటా.. కందాళ.
కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి.
గ్రామ ఎంపీటీసీ బారి తిరపతమ్మ-మల్సూర్,పద్మశాలి మండల నాయకులు లగిశెట్టి వీరబాబు,యూత్ ప్రెసిడెంట్ మూడు వీరబాబు తో పాటుగా 72 కుటుంబాలు,కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
ఈసంధర్భంగా మాట్లాడుతూ క్యాంప్ కార్యాలయంకు సామాన్య ప్రజలు వచ్చిన,కార్యకర్తలు వచ్చిన,కూలీ పనికి పోయే వాళ్ళు వచ్చిన చినోళ్ళు,పేదోళ్ళు ఎవరోచ్చిన వారు చెప్పిన మాటలు విన్నాను,మీకు ప్రతి రోజు అందుబాటులో ఉండి,మీతో మమేకం అయ్యాను .చివరిగా ఒక మాట చెప్తున్న కరోన కాలంలో కూడా మీతో ఉన్న,కష్టకాలంలో కూడా మీతో ఉన్న,ఈకట్టే కాలే వరకు మీతోనే ఉంటా,మీకు ఏం కావాలన్నా చేస్తా,దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి.మాయమాటలకు మోసపోకండి,మీకు నేను మంచి చేశాను అనుకుంటే ఓటు వెయ్యండి.నేను మీ మనిషిని.