దుబ్బాక అక్టోబర్ 29
సిద్దిపేట నుండి రామాయంపేట వెళ్తుండగా హబ్సిపూర్ వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది . లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సూచిక బోర్డులో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
