సెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ శంభీపూర్ లో ఈరోజు వైభవంగా జరిగిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ: సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.
