రాజకీయం

బిజెపి జెండా ఎగరడం ఖాయం

160 Views

దౌల్తాబాద్: దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే బిజెపి దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో వార్డు సభ్యులు లక్ష్మీ, నరసవ్వ, స్వరూప, అనురాధ, తిరుమలాపూర్, ముత్యంపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపిలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి, ముబారస్పూర్ ఉపసర్పంచ్ స్వామి, బిజెపి మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్, ఉపాధ్యక్షుడు గడ్డమీద స్వామి, నాయకులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి ,రామస్వామి గౌడ్, అనిల్ రెడ్డి, చంద్రం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు…..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *