తేది.17.09.2023
నిజామాబాద్ జిల్లా
మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం తో నిజామాబాద్ జిల్లా లోని యువజన సంఘాలకు ఎమ్మెల్యే గణేష్ బిగాల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా.ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ
నిజామాబాద్ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశం తో మట్టి ప్రతిమ లను పంపిణీ ని శ్రీకారం చేసినఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ధన్యవాదాలు.
పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటాము.
యువజన సంఘాలు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటు చేయాలి.
వినాయక చవితి పండుగను సంతోషాలతో ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,BRS సీనియర్ నాయకులు రామ్ కిషన్ రావు ,నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సూదం రవి చందర్, సిర్ప రాజు,సత్య ప్రకాశ్,పంచారెడ్డి సూరి,జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు,లక్ష్మీ నారాయణ భరద్వాజ్, చిన్నూ గౌడ్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





