సంగారెడ్డి అక్టోబర్ 29
సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండల నాగ్ సాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చింత ప్రభాకర్, టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంగారెడ్డి లో చింత ప్రభాకర్ గెలుపు ఖాయం అయిపోయింది 5 ఏండ్లలో 5 సార్లు కూడా రాని జగ్గారెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు.
తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, సంగారెడ్డి ప్రజలను మోసం చేసింది జగ్గా రెడ్డి. ఇలాంటి దొంగలకు ఓటు వేస్తే రాజకీయంగా లబ్ధి పొందడమే తప్ప ప్రజలకు దక్కేదేమి లేదు. కావున ప్రజలందరూ బి.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి చింత ప్రభాకర్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.
