బాలానగర్ డివిజన్ పరధిలో జోరుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
అక్టోబర్ 29
కూకట్పల్లి నియోజకవర్గ0 బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కొరకు ఎన్నికల ప్రచారం డివిజన్ పరధిలోని గీత నగర్ మరియు నవజీవన్ నగర్ లో ఇంటింటి ప్రచారానికి చేపట్టారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలైన దళితబంధు, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గత తొమ్మిదిన్నరేండ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కి అవగాహన కల్పిస్తూ మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నామొ వివరిరించారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,మహిళలు, కాలోని అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.





