Breaking News

ఇంటి పేరు చెప్పుకోని వ్యక్తి రసమయి.

352 Views

-బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే.

-మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్.

(తిమ్మాపూర్ అక్టోబర్ 29)

ఇంటిపేరు కూడా చెప్పుకోని నాయకుడు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని మొగిలిపాలెం,పర్లపల్లి,నల్లగొండ, మక్తపల్లి, బాలయ్యపల్లి, కొత్తపల్లి, నుస్తులాపూర్,ఇందిరానగర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా మక్తపల్లి లో నిర్వహించిన మీడియా సమావేశం లో మోహన్ మాట్లాడుతూ పదేళ్లుగా అధికారం లో ఉంటూ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు.రామక్రిష్ణకాలనీ లోని 100 ఎకరాల భూములను అమ్మడం దారుణమని పేర్కొన్నారు.ఎకరానికి 2 లక్షల చొప్పున పేద ఎస్సీ, బీసీ రైతుల నుండి సేకరించి అట్టి భూములను కోట్లాది రూపాయలకు విక్రయించి పేదల నోట్లో మట్టికొట్టినట్లయిందని అన్నారు.రాజీవ్ స్వగృహ పేరుతో సేకరించిన భూముల్లో ఏదైనా ఒక ప్రయోజనార్థకమైన నిర్మాణం చేపట్టి ఉండాల్సి ఉందని అన్నారు.ఇట్టి భూములలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని బిజెపి డిమాండ్ చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి సరైన నివేదిక లు ఇవ్వలేదని ఆరోపించారు.బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ లు రెండు ఒక్కటేనని ఇందుకు గత చరిత్రే నిదర్శనమని అన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనాటి టీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పటికి పిసీసీ హోదాలోని రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని అన్నారు.ఎప్పటికైనా బిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు.గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సినిమాల్లో నటించే వారిని,వైద్య వ్యాపారం చేసే వారిని, సేవ చేసే నాయకునిగా ప్రజలు గుర్తించడం లేదని అన్నారు.దళిత బందు, గృహలక్ష్మి, బీసీ బందు లాంటి పథకాలను పూర్తి స్థాయిలో ఎక్కడైనా అమలుచేసారా అని ప్రశ్నించారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా పేరున్న తనను ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.వివిధ గ్రామాలకు చెందిన సీపీఐ, కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు పాశం సంపత్ రెడ్డి,ఎలగందుల రవీందర్,పరకాల సాగర్, ఎల్కపల్లి శ్రీకాంత్ తోపాటుగా సుమారు 60 మంది పార్టీలోకి చేరారని మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి తెలిపారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి,జిల్లా ఈసీ సభ్యులు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్,ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,మండల ఉపాధ్యక్షులు మార్క హరికృష్ణ గౌడ్, పబ్బ తిరుపతి,మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతం వరలక్ష్మి, బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి స్వామి,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,అధికార ప్రతినిధి తాళ్లపెల్లి రాజు గౌడ్, గాండ్ల రాము,ఈసీ మెంబర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఐల రాజశేఖర్,పాశం రాఘవరెడ్డి,పడాల శ్రీనివాస్ గౌడ్,జంగ సునీల్ రెడ్డి,రేగుల శ్రీనివాస్, బొడ్డు అశోక్, అభిచరణ్, రంజిత్,సాయికృష్ణ తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *