ప్రాంతీయం

అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి

172 Views

మంచిర్యాల జిల్లా.

అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ.

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం.

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్  పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, పూల మాలలు వేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, అన్నీ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found