రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరికి వృత్తిపరమైన పనిముట్లను ప్రభుత్వం ఉచితంగా అందించేది అన్నారు.




