వడ్డేపల్లి అక్టోబర్ 28 :కొంకల గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి ఊరేగింపు …
జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలం, కొంకల గ్రామంలో రామాయణ సృష్టికర్త, ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి కొంకల గ్రామ వాల్మీకి సభ్యులందరు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో వాల్మీకి చిత్రపటాని ఊరేగింపు చేశారు.
ఆదికవిగా వాల్మీకి నిలిచారని సీతారాముల జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన రామాయణాన్ని మధుర కావ్యంగా, మహాకావ్యంగా లోకం అదరిస్తున్నదని గుర్తుచేసుకున్నారు.
వాల్మీకి మహర్షి ఆశయాలను కొనసాగిస్తాం..
ఈ కార్యక్రమంలో మస్కె కృష్ణ సుధకర్ జల్లి పరుశ ఆంజనేయులు మరియు వాల్మీకి యువకులు మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.