అక్టోబర్ 28 :ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లి చెరువు తండా గ్రామ పంచాయతీ కి చెందిన
గుగులోత్ రవి నాయక్ ( 55 )అనే గిరిజన రైతు ఎలుగుబంటి దాడిలో శనివారం గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ,
వెంటనే అతని కుటుంబ సభ్యులు అతన్ని ఎల్లా రెడ్డి పేట మండల కేంద్రము లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు ,
గుంటపల్లి చెరువు తండాకు చెందిన రవి నాయక్ శనివారం రోజున గొర్రెలను కాస్తూ సమీపంలోని అడవిలోకి వెళ్ళాడు. అక్కడే పిల్లలను పెట్టిన ఎలుగుబంటి ఉండడంతో అది గమనించకుండా ఉన్న రవి పై ఎలుగుబంటి దాడిచేసి విచక్షణ రహితంగా గాయపర్చింది దీంతో అతనికి తీవ్రంగా రక్తస్రావమై సంఘటన స్థలంలో ఆయన రక్షించండి రక్షించండి అంటూ పెద్ద గా అరవటం తో చుట్టూ ప్రక్కల వారు కర్రలు పట్టుకుని అరుస్తూ అక్కడికి రావడంతో ఎలుగుబంటి పారిపోగా వారు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సక్కారం నాయక్ మాట్లాడుతూ మేము తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయిన కోరారు,
