రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శనివారం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుందని అన్నారు. పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు మహిళలు గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు. నలుగురికి మాత్రమే లాభం జరుగుతుందని అన్నారు.




