రాజకీయం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలి కనకయ్య గౌడ్

65 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్ అన్నారు గురువారం వారు మాట్లాడుతూ గజ్వేల్ శోభ గార్డెన్ లో శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, మంత్రి కొండ సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, మైనం పల్లి హనుమంతరావు,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొంటారని
ఉదయం 10-00 గంటలకు ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుంచి శోభ గార్డెన్ వరకి ర్యాలీ.నిర్వహించి శోభ గార్డెన్ లో సమావేశం ఉంటుందని, గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, మహిళా కాంగ్రెస్, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్