*కొలువుదీరిన సర్కారులో నూతన మంత్రులు?*
కోకిల డిజిటల్ మీడియా
హైదరాబాద్:ప్రతినిధి
తెలంగాణ గవర్నమెంట్ లో నూతన మినిస్టర్స్ వీరే.
తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల శాఖ, కొండా సురేఖకు మహిళా సంక్షేమం శాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, దామోదర రాజనర్సింహకు మెడికల్ అండ్ హెల్త్ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాలు శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమం శాఖ, తుమ్మల నాగేశ్వరావుకు రోడ్లు భవనాలు శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
