*విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలి*
* ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాల నరసయ్య
రాయపోల్ మండల కేంద్రంలో విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాలనర్సయ్య ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల నరసయ్య మాట్లాడుతూ విశ్వజన కళామండలి 45 సంవత్సరాలు పురస్కరించుకొని గద్దర్కు నివాళులర్పిస్తూ 45 పాటలను బహుజన స్వరార్చన కార్యక్రమం హైదరాబాదులోని రవీంద్ర రవీంద్ర భారతి కళావేదిక నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. మాసర్జీ తన పాటలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటలు రాసి చైతన్యపరిచారున్నారు. మాస్టర్జి రాసిన 45 పాటలను గద్దర్ కు అంకితం చేస్తున్నామన్నారు. గద్దర్ తన జీవితాంతం మొత్తం బడుగు బలహీన వర్గాల పోరాడుతూ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గం కోసం పనిచేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం ప్రకాష్, నర్సింలు, మల్లేష్, ప్రశాంత్, అశోక్, కనకయ్య, స్వామి, రాజు, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.