తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మంచిర్యాల్ వాహన తనిఖీలను ముమ్మరం చేసింది.
ఎన్నికలవేళ వాహనాలలో డబ్బులు తరలిస్తున్నారని,ఓటర్లకు డబ్బులు పంచడానికి అని ప్రతిపక్షాల నుండి ఫిర్యాదులు రావడంతో మంచిర్యాల పోలీస్ వారు మంచిర్యాల నియోజకవర్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసే సమయంలో వాహనంలో డబ్బు దొరుకుతే డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోతే ఆ డబ్బును సీజ్ చేసి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అప్పగిస్తున్నారు.
మినిమం 50 వేల వరకు నగదును తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. అంతకుమించి డబ్బు ఎక్కువగా ఉంటే ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపించకపోతే నగదును సీజ్ చేస్తున్నారు.






