పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (అక్టోబర్ 21-31 వరకు)లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు కమాండంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ రోజు పోలీస్ అధికారులు,సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా ఏ.ఆర్.యస్.ఐ మరియు క్రింది స్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు వర్క్ లైఫ్ బాలన్స్ ఇన్ పోలీస్ అనే అంశం పై మరియు ఆర్.యస్.ఐ/ యస్.ఐ పైస్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు రోల్ అఫ్ పోలీస్ ఇన్ మైంటైనింగ్ జెండర్ ఈక్వలిటీ ఇన్ సొసైటీ అనే అంశం పై పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలను నిర్వహించారు.
వ్యాస రచన పోటీలలో పాల్గొని మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారికి బహుమతులు అందజేయటం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ. జయప్రకాష్ నారాయణ , శ్రీ పార్థసారథి రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
