నేరాలు

గుడుంబా తయారుచేసి అమ్ముతున్న మహిళ అరెస్ట్

126 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లో ఓ మహిళ గుడుంబా తయారు చేస్తూ అమ్ముతున్నదని పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాలు ప్రకారం వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య రేణ అనే మహిళ గుడుంబా తయారు చేస్తూ అమ్ముతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటిపై గురువారం దాడి చేయగా రెండు లీటర్ల గుడుంబా నలభై లీటర్ల బెల్లం పానకం లభించింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్సై నవత తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *