దౌల్తాబాద్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామానికి చెందిన పెద్ద బుల్లి కొమురయ్య (53) ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. మద్యానికి బానిస అయ్యాడు. గురువారం ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన భార్యతో గొడవపడి పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు కొమురయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు మృతుని కొడుకు కనకయ్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
