నేరాలు

జిల్లాలో గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు

118 Views

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని,జిల్లా పరిధిలో తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు..

గంజాయి మత్తులో ఎంతో మంది యువత వారికి తెలియకుండానే నేరాలకు పాల్పడి జైలుజీవితం గడుపుతున్నారు.గంజాయి,మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో ఈ సంవత్సరం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న,సేవిస్తున్న వారిని గుర్తించి 41 కేసులు నమోదు చేసి 83 మందిని అరెస్ట్ చేసి 32 కిలోల 204 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *