రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల శివారులో గల తురక కాశి కుటుంబాలను ఆదుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గురువారం అన్నారు.ఈ సందర్భంగా 60 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి సాదర పూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఇటు గుట్టల ప్రాంతంలో బండరాళ్లు కొడితే కేసులు పెడుతూ తురుక కాశీలను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుందన్నారు. వీరికి ఇప్పటివరకు కనీసం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీరిని ఆదుకుంటామని ఆరు స్కీముల గ్యారంటీ పథకంలో వీరిని ఆదుకొని వీరి కుటుంబాలను బాగుపరచడం జరుగుతుందన్నారు
