Breaking News విద్య

కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు సన్మానం.,..

369 Views

సన్మానం
– రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట:

నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక రెడ్డి తో పాటు వారి తల్లిదండ్రులను అదేవిధంగా ఆపదలో ఉన్న ఆపద్బాంధవుడు సుమారు 47 సార్లు రక్తదానం చేసిన వంగ గిరిధర్ రెడ్ది, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, జాతీయ అవార్డు గ్రహీత ముత్యాల ప్రభాకర్ రెడ్ది, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాయిని భాస్కర్ రెడ్డిలను ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులకు గౌరవంతో పాటు ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేపా అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *