బిజెపిలో చేరిన యువకులు
25 అక్టోబర్
కామారెడ్డి జిల్ల పెద్ద కొడప్గల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 19 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు అరుణతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా అధ్యక్షురాలు అరుణతార బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





