Breaking News

సమ్మేళనం విజయవంతం చేయండి

65 Views

 

 

ఉగాది కవి సమ్మేళనం విజయవంతం చేయండి

ఏప్రిల్ 8

సిద్దిపేట జిల్లా  పి టి ఎఫ్  గజ్వేల్ జోన్ మరియు సకల జనుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే

క్రోది నామ సంవత్సర ‘ఉగాది’ కవి సమ్మేళన కార్యక్రమానికి సంబందించిన కర పత్రాన్ని టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మరియు స.జ.ర.సం అధ్యక్షులు కటుకం రాజయ్యలు మాట్లాడుతూ

ప్రకృతి మరియు సమాజంలో వస్తున్న మార్పుల పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండటం సామాజిక బాధ్యతగా గుర్తు చేస్తూ గత పది సంవత్సరాల నుండి గజ్వేల్ పట్టణములో టిపిటియఫ్ గజ్వేల్ జోన్ మరియు సకల జనుల రచయితల సంఘం ఆధ్వర్యంలో “ఉగాది కవి సమ్మేళనము” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

యువ కవులను, విద్యార్థులను భాగస్వాములను చేసి ప్రోత్సహించడం జరుగుతుందని,

ప్రకృతి వనరుల విధ్వంసం సమాజంలో విలువల విధ్వంసం కొనసాగుతున్న నేటి తరుణంలో మనం ఉగాది జరుపుకుంటున్నాం. ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది అని, విలువలను పరిరక్షించడంలో మనందరం భాగస్వాములం అవుదామని కోరారు.

ఉగాది అంటేనే మార్పు, వసంతం అందరి సొంతం కావాలి, షడ్రుచులు అందరి జీవితాలలో భాగం కావాలని . కవులు, కళాకారులు, రచయితలు తమ సాహిత్య ప్రక్రియలైన ఆట, పాట, మాట, కవిత పద్య రూపాలలో వ్యక్తపరచడానికి మంగళవారం సాయంత్రం 05:00 గంటలకు టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో నిర్వహించే “ఉగాది కవి సమ్మేళనం” కార్యక్రమంలొ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, గజ్వేల్ మండలాధ్యక్షులు పాపిరెడ్డి,గజ్వేల్,జగదేవపూర్,దౌల్తాబాద్ మండలాల ప్రధాన కార్యదర్శులు నాగరాజు, సత్తయ్య, యాదయ్య,సీనియర్ నాయకులు ఎల్లయ్య,శ్రీనివాస్,భాస్కర్ లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్