ప్రాంతీయం

టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రపు శ్రీనివాస్ నియామకం

20 Views

టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రపు శ్రీనివాస్ నియామకం

ప్రధాన కార్యదర్శిగా జనవేణి శ్రీనివాస్

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, డిసెంబర్ 29

( తెలుగు న్యూస్ 24/7 )

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ సభ్యుల సమావేశం సోమవారం రోజున హుస్నాబాద్ లోని టిడబ్ల్యూజేఎఫ్ కార్యాలయములో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యులు వరయోగుల మురళీధర్ స్వామి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖుద్రత్ అలీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా మహాసభలను విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన డివిజన్ కార్యకవర్గాన్ని ప్రకటించారు. డివిజన్ అధ్యక్షులుగా గుర్రపు శ్రీనివాస్,(వాయిస్ టుడే)ఉపాధ్యక్షులు పలుమారు సంతోష్ (ప్రజా వారధి), కొత్త పూర్ణచందర్, (రుద్ర న్యూస్), కోశాధికారిగా గాదగొని అఖిల్ (నినాదం),మీడియా కన్వీనర్ మార్క రాజు (నేటికేసరి), సహాయ కార్యదర్శిగా తౌట్ దిలీప్ కార్యవర్గ సభ్యులుగా బండి మధుసూదన్, పిన్నోజు సంజీవ్ గడిపే శేఖర్ కండే చక్రపాణి గూళ్ళ తిరుపతి లను ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డివిజన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టుల సామాజిక భద్రత ఉద్యోగ భద్రత అందరం కలిసికట్టుగా సాధించుకునేందుకు పోరాడుదాం అని డివిజన్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వివిధ హోదాల్లో నియమతులైన వారందరూ తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ రాష్ట్ర జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *