ప్రాంతీయం

రేపే 650 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ

71 Views

మంచిర్యాల

మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. 650 పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తు లో 1200 పడకల స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణంకు 360 కోట్లు అవసరం కాగా బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కాదని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ రావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యంకు నిదర్శనమని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. మంచిర్యాల ను ఉత్తర తెలంగాణ కు తలమానికంగా మెడికల్ హబ్ చేస్తానని భరోసా ఇచ్చారు. నాలుగు తరాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని అన్నారు. రెండున్నర ఏండ్లలో ఆసుపత్రి నిర్మాణం చేసి తీరుతానని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా ప్రజలు ఆసుపత్రి భూమి పూజ క్రతువుల్లో భాగస్వాములు కావాలని కోరారు.

మోడీ హామీలు ఏమయ్యాయి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎక్కడ అమలు చేసారని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. తాను గెలిచిన పది నెలల్లోనే హామీలు అమలు చేయలేదని విమర్శలు చేసే ముందు నరేంద్రమోదీ ఇచ్చి కోట్ల ఉద్యోగాలు, స్విస్ బ్యాంకు డబ్బు పంపిణీ ఏమైందని నిలతీశారు. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనులు ప్రయివేటు పరం కాకుండా సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే గొప్పోడివి కావని హితవు పలికారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్