*మాదిగల యుద్ధభేరి విజయవంతం చేయాలి
*
హలో మాదిగ చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ మాదిగల యుద్ధభేరి నవంబర్ 5వ తారీఖున జరిగే సభను విజయవంతం చేయవలసిందిగా గుండారం ఎల్లం, అనాజిపూర్ ఇస్తారు అన్నారు.ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని అంబేద్కర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమైన వాటాకై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు సామాజిక న్యాయం జరగాలి. మాదిగ జనాభా ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలి.ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించే విధంగా ప్రకటించాలని మాదిగ డిక్లరేషన్ ప్రకటించాలని,రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విధంగా అన్ని రాజకీయ పక్షాలు అధికార బిజెపి మీద ఒత్తిడి పెంచాలని.మాదిగలు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రజా సంఘాల మేధావులు మిగతా కులాల కంటే అధికంగా జనాభాలో ఉన్నప్పటికిని సామాజిక నిర్మాణంలో ఉత్పత్తిలో తమ పాత్ర విస్మరించలేనిది వేల సంవత్సరాలుగా విద్యకు రాజ్యాధికారానికి సంపదకు సామాజిక గౌరవానికి దూరంగా ఉన్న మాదిగలు చెప్పులు కుట్టి,డబ్బులు కొట్టి సమాజానికి సేవ చేస్తున్నారు.అయినా వర్గీకరణ బిల్లును మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పి బిజెపి తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అయినా రెండుసార్లు అధికారంలో ఉన్న బిజెపి ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టక పోవడం చాలా దారుణమైన పరిస్థితి దేశంలో ఎన్నో చారిత్రాత్మక బిల్లులో పెడుతున్నటువంటి బిజెపి పార్టీ మాదిగల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమైన వాటాకై మేం ఎంతో మా వాటా అనే ఏకైక లక్ష్యంతో త్వరలో జరగబోయే మాదిగల యుద్ధభేరిని విజయవంతం చేసి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా మాదిగ ప్రజానీకం సంసిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాసంపల్లి కరుణాకర్, మర్రి కింది శ్రీకాంత్, మరికింది బాబు, శ్రీనివాస్, కొత్తల్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.




