ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 25, మార్కెట్ సమీపంలోని శివాలయం ఆధ్వర్యంలో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 15వ తేదీన నుండి ప్రారంభించారు. హిందూ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రధమ రోజున దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 24వ తేదీన విజయదశమి వేడుకలు ముగిశాయి. తొమ్మిది రోజులు రేపటితో పది రాత్రులలో 9రూపాలలో దుర్గాదేవిని భక్తులు విశేషంగా పూజలు చేశారు. దేవి శరన్నవరాత్రులను శరద్ నవరాత్రులని, శరన్నవరాత్రులు అని, శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు. ఇక దేవి శరన్నవరాత్రుల క్యాలెండర్ విషయానికి వస్తే తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారు రేపు కొన్ని గ్రామాలలో అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి.
